Friday, November 23, 2012

బాబా మాటలు

ఊరకనే  చదువు వలన ప్రయోజనము లేదు . నీవు చదివినదంతయు 
నాలోచింఛి ఆచరణలో పెట్టవలెను . గురువు యొక్క ఆశ్వీర్వాదము 
లేనిదే కేవలము పుస్తక జ్ఞానము వలన ఫలితముండదు .  ఆత్మ 
సాక్షాత్కారము లేనిదే  పుస్తక జ్ఞానము వలన ప్రయోజననము  లేదు .
ఎవరు అహంకారపూరితులో  ఎవరు ఇంద్రియ విషయముల  గూర్చి 
ఎల్లప్పుడుచింతిం చేదరో  వారికి గురు భోదనలు వ్యర్ధములు .                                                 

నీవు దాహము గల వారికి నీరిచ్చినచో ,  ఆకలి గొన్నవారికి 
అన్నము పెట్టినచో . దిగంబరులకు వస్త్రమిచ్చినచో  భగవంతుడు 
మిక్కిలి ప్రీతి చెందును . దానము చేయువాడు  ఇచ్చునది 
ప్రస్తుతము  విత్తనము నాటుట  వంటిది . అది ముందు ముందు 
గొప్ప పంట అనుభవించుట  కొరకే .  నీవు గురువు  నందు 
నమ్మకము విశ్వాసము ఉంచుము ........ 

Saturday, November 17, 2012

బాబా మాటలు

మన హృదయము స్వచ్ఛముగా వున్నంత  వరుకు ఏమియు 
దోషము  లేదు  అని సాయి నానా సాహెబ్   చందోర్కర్  తో 
అన్నారు .ద్వారకామాయి వద్ద గల తాబేలు  బొమ్మ
 ద్వారకామాయిలోనికి  భక్తుడు ఎలా వేళ్ళలో తెలిపీ  ప్రతీకగా 
భావించవచ్చు .  భక్తుడు  తనలో బహిర్గతములవుతున్న 
ఇంద్రియములను  తాబేలు వలే  లోనికి ఉపసంహరించుకోవాలి ,
అప్పుడే  ద్వారకామాయి  లోని బాబాను దర్శించ గలము ........, 

Friday, October 19, 2012

బాబా మాటలు

నీ దగ్గరకు  ఎ  ప్రాణి  వచ్చినా  తోలేయ్యవద్దు ,  ఆదరించు ,  ఋణానుభంధంపై
.నమ్మకముంచి  గుర్తుంచుకో ,   ఆకలిగొన్న   వారికి   అన్నం ,  గుడ్డలు  లేనివారికి
యివ్వు ..   భగవంతుడు  సంతోషిస్తాడు .  నిన్ను ఎవరైనా  సరే  ఏమైనా  అడిగితే
సాధ్యమైనంతవరకు  యివ్వు ,  లేక యిప్పించు.  " లేదు  " అనవద్దు .ఇచ్చేందుకు
ఏమిలేకపోతే  మర్యాదగా చెప్పు .  చులకనచేయడం, కోపగించుకోవటం  తగదు .
నీ దగ్గరున్నా   ఇవ్వాలనిపించక పోతే   లేదని  అబద్దం  చెప్పవద్దు .   ఇవ్వలేనని
మర్యాదగా చెప్పు   .






Monday, October 15, 2012

బాబా మాటలు

ఆద్యంతాలు  లేని యీ పాదాలు  పరమ  పవిత్రమైనవి . నాపై   పూర్తి
విశ్వాసముంచు , నీ  కోరిక  నెరవేరుతుంది .  నా  పై  నీ  దృష్టి  నిలుపుము .
నేనూ  నీపై  దృష్టి   నిలుపుతాను . నిన్ను చివరికంటా  గమ్యం  చేరుస్తాను .
నన్ను  నమ్మినవారిని  పతనం కానివ్వను. నన్నే ధ్యానించి , నా  లీలలు
గానం  చేసేవారు నేనుగా  మారిపోతారు ; వారి కర్మ  నశిస్తుంది.  నేను 
వారి చెంతనే  వుంటాను .  నా   సమాధి  నన్నాశ్రయించిన  వారితో
మాట్లాడుతుంది .  నా  సమాధి  నుంచి  నుండి   నా కర్తవ్యం  నిర్వహిస్తాను .
నా  నామం పలుకుతుంది .  నా మట్టి  సమాధానము  చెబుతుంది .



Sunday, October 14, 2012

బాబా మాటలు

నా భక్తుడు  ఎంత దూరం  ఉన్నప్పటికీ , 1000  క్రొసుల  దూరమున  నున్నప్పటికి ,
పిచ్చుక కాళ్ళకు  దారము కట్టి   యీడ్చినటుల  అతనిని  శిర్దికి  లాగెదను.

Friday, October 12, 2012

బాబా మాటలు

నవవిధ  భక్తులు.  వీనిలో ఏదయినానవవి ఒక మార్గమును హృదయ పూర్వకంగా 
  అనుసరించిన  యడలభగవంతుడు సంతుప్తి చెందును .భక్తుని గృహము నందు
 ప్రత్యక్షమగును .భక్తి లేని సాదనములన్ని-అనగా  జపము , తపము ,  యోగము 
 ఆద్యాత్మిక  గ్రంధములు  పారాయణ, వానిలోని  సంగతులునితురులకు  భోదిచుట
మోదలగునవి   వ్యర్ధములు .  భక్తియే   లేనిచో  వేదములలోని  జ్ఞానమును
జ్ఞానియను  గొప్ప  ప్రఖ్యాతి , నామ మాత్రపు  చేయు భజన , ఇవన్నియు
 వ్యర్ధము . కావలసినది ప్రేమాస్పదమయిన  భక్తి మాత్రమె ..సత్యమును 
 తెలిసికొనుటకు ప్రయత్నమూ చేయవలెను .


Saturday, September 15, 2012

బాబా మాటలు

మానవుడు  భగవంతుడు  ఇచ్చిన  దాని తో  సంతుష్టి   చెందవలెను .భగవంతుడు 
ఏది  యిచ్చేనో   అది  యల్లా  తన మేలుకోరకే   యని  గ్రహించవలెను .  ఇతరుల 
సొత్తుకై   యాశించరాదనియు , ఉన్నదానితో సంతుష్టి  చెందవలెను. భగవంతుడు
మన మేలు కొరకే  దాని ఇచ్చియున్నాడనియు ,  కావున  అది మనకు  మేలు
కలుగ  చేయునని  గ్రహించవలెను . 







Wednesday, August 8, 2012

baba maatalu

షిర్డీ సాయి ఏకాదశ  సూత్రములు ..1] షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ  పరిహారము.
2] ఆర్తులైననేమి    నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించు
నంతనే సుఖసంపదలు లుండ గలరు. 3]ఈ  భౌతిక దేహనంతరము
సైతము  నేనప్రమతుడునే. 4] నా భక్తులకు  రక్షణ  నా సమాధి నుండియే
వెలువడును .  5] సమాధి నుండి నా  మానుష శరీరము మాటలాడును.
6] సమాధి నుండియే నేన సర్వకార్యములు నిర్వహింతును. 7] నన్ను
ఆశ్రయించు వానిని ; నన్ను శరణు జొచ్చిన  వానిని నిరంతరము రక్షించుటఏ
నా  కర్తవ్యం.  8] నా యందేవరి దృష్టి కలదో  వారి యందే నా  కటాక్షము కలదు.
9] మీ భారములను  నాపై  బడవెయుము, నేనుమోసేదను. 10] నా సహాయము
గాని  కోరిన తత్ క్షణమే యోసంగేదను.  11] నా భక్తుల  గృహములందు " లేమి "
యను  శబ్దమ పొడసూపదు.

          

Saturday, July 14, 2012

బాబా మాటలు

శ్రీ గజననమహరాజ్ 1910  వినాయక చతుర్ధి  రోజున  మహాసమాధి చెందినారు .
వీరు సమాధి చెందిన యడున్నార  సంవత్సరములకు  1918   అక్టోబర్   15 న 
శ్రీ షిర్డీ సాయి బాబా మహా సమాధి  చెందారు .  శ్రీ సాయి బాబా సమాధి చెందిన 
ఏడున్నర   సంవత్సరములకు  శ్రీ తాజుద్దీన్  బాబా 1925 ఆగస్ట్  18 న 
మహాసమాధి చెందారు . విచిత్రమే మిటంటే  ఈ ముగ్గురు  మహాత్ములు  సమాధి 
చెందే నాటికి ఒకొక్కరి మధ్య షుమారు ఏడున్నర సంవత్సరములు . ఆ తరువాత 
మరల   ఏడున్నర ఏడున్నర సంవత్సరముల  నాటికి  శ్రీ గులాబ్ బాబా  జూలై 1 న 
1932 లో జన్మిచారు . ఇది దత్త సంప్రదాయము .  

Saturday, July 7, 2012

బాబా మాటలు

1912    సంవత్సరము లో  బొంబాయి నుండి  డాక్టర్  రామారావు కొతారే  యను నతడు
షిర్డీ వచ్చెను .అతని మిత్రుడు ఐన  భాయికృష్ణాజీ  అలీ బాగకర్ అను నతడు  వెంట వచ్చెను ..
షిర్డీ లో వారు సగుణ్  మేరు నాయక్ , జి .కే .దీక్షిత్  కు సన్నిహితులైరి.   అనేక విషములు 
తమలో చర్చించుకొనునప్పుడు సంభాషణ  వసాస్తూ   మొట్టమొదట షిర్డీ లో ప్రకటమై ,
 తన గురుస్థానమని  చెప్పిన  వేపచెట్టు  క్రింద పాదుకలు ప్రతిష్టించవలెననని   నిశ్చ యించుకోనిరి .
పాదుకల నమూనా తో ఖండోబా మందిరముందున్న శ్రీ ఉపాసనీ మహారాజ్  వద్దకు  పోగా
కొన్ని మార్పులు  చేసి  పద్మము , శంఖము , చక్రము,చేర్చి  బొంబాయి  లో చేయించిరి.
శ్రావణ పౌర్ణిమ రోజున ఉదయం 11గంటలకు  జి. కే. దీక్షిత్ తన శిరస్సు   పై  పాదుకలు 
 పెట్టుకొని  ఖండోబా  మందిరం  నుండి  ద్వారకా మాయి కి  ఉత్సవముతో  వచ్చిరి .  బాబా
యా పాదుకలు స్పృశించి అవి భగవంతుని పాదుకలని చెప్పిన  తరువాత  ఆ పాదుకలను 
వేపచెట్టు  క్రింద  ప్రతిష్టించిరి . అప్పటిలో  దీక్షిత్  పాదుకలకు  నిత్య పూజ చేసినారు .నేటికి 
2012   సంవత్సరము , శ్రావణ పౌర్ణిమనకు, గురుస్థానము లో  పాదుకలు   ప్రతిష్టించి
100  సంవత్సరములు పూర్తి వుతుంది .                 జై సాయి రామ్...
             

Sunday, July 1, 2012

బాబా మాటలు

1908 లో ఒకరోజు పండరి నుండి వచ్చిన   కృష్ణజీనూల్కర్  చావడిలో  ఉన్నాడు .
బాబా  శ్యామాతో , ఆ నూల్కర్ ను ధుని వద్ద స్తంభాని  పూజించుకొమ్మని చెప్పు 
అని అన్నారు సాయి . దేవా  మీకైతే చేస్తాము గాని స్తంభాన్నెందుకు  పూజిస్తాము ?
అన్నాడు శ్యామా .మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టిన  మీదట ఒప్పుకొన్నాడు .
ఇంతలో  నూల్కర్ పంచాంగం చూస్తే, నాడు [వ్యాసపూర్ణిమ]  గురుపూర్ణిమ .
తాత్య , దాదాకేల్కర్ ,శ్యామా  మొదలగువారు సాయిని పూజించారు . 
  


     

Sunday, June 24, 2012

బాబా మాటలు

నేను ఒక రూపాయి దక్షణ ఎవరి వద్ద నుండి గాని తీసికోనినచో 
దానికి నేను పది రెట్లు  ఇవ్వవలెను.నేనూరక ఏమి తీసికొనను.
యుక్తాయుక్తములు తెలియకుండ నేనెవరిని అడగను.ఎవరైన 
ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ యున్నచో వానివద్దనే నేను 
ధనము పుచ్చుకొందును.దానము చేయువాడిచ్చునది
ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది.  అది మునుముందు 
గొప్ప పంట  అనుభవించుట కొరకే .  ధర్మము చేయుటకు 
ధనముప యోగించవలెను.దక్షిణ  ఇచ్చుచున్నచో
వైరాగ్యము  పెరుగును.దానివలన  భక్తి జ్ఞానములు  కలుగును.   

  

Sunday, June 17, 2012

బాబా మాటలు

నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించితిని.  నేను వారిని చూచునపుడు వారు 
 గొప్ప  ధ్యానములో వుండునట్లు కనిపించిరి.మేమిద్దరమూఆనందములో మునేగేడివారము.
  రాత్రింబవళ్ళు నిద్రాహారములు  లేక నేను వారి వేపు  దృష్టి నిగిడ్చితిని.    వారినిచూడనిచో 
 నాకు శాంతి లేకుండెను. వారే  నాఆశ్రయము.  నా మనస్సు  ఎల్లప్పుడు  వారి యందే 
నాటుకొని  యుండెడిది .ఇదియే ఒక పైస  దక్షణ .    సాబురి  అనునది రెండవ పైస.
  రాత్రింబవళ్ళు  నిద్రాహరములు  మరచి గురువు వైపు దృష్టిని స్థిరము చేయవలెను. 
మనస్సు ఎల్లప్పుడు వారి యందేవుండవలెను . వారి  ద్యానము , వారి సేవ అనగా 
 వారు చెప్పిన మాటలు ఆచరించుటయే  వారి  సేవ . గురువు చెప్పినట్లు జీవితమందు
 నడుచుకోనవలెను.  అదియే  గురుసేవ.గురువు చెప్పిన  మాటను ఆచరించుటయే  గురుదక్షణ .
 దానినే  నిస్ట్ట  అనెదరు ,  

Friday, June 15, 2012

బాబా మాటలు

నా కొక గురువుండెను.  వారు  మిక్కిలి  దయాద్ర హృదయులు .వారికి చాలా కాలము 
 శుశ్రూష చేసితిని , కానీ  నా చెవిలో  వారు ఎ  మంత్రము వూదలెదు. వారిని విడచు 
 తలంపే  లేకుండెను.వారితోనే  వుండుటకు , వారి సేవ చేయుటకు , వారి వద్ద  కొన్ని 
ఉపదేశములు  గ్రహించుటకు నిశ్చయింఛితిని. కానీ  వారి మార్గము  వారిది .
 వారు నా తల గొరిగించిరి  రెండు  పైసలు దక్షిణ  అడిగిరి .  వెంటనే  ఇచ్చితిని.
 వారు కోరిన  రెండుకాసులలో  ఒకటి  నిస్ట్ట   రెండవది  సంతోష  స్తైర్యములతో 
గూడిన  ఓరిమి .  నేను రెంటీనీ  వారి  కర్పించితిని. వారు ప్రాసన్నులైరి.     

Sunday, June 10, 2012

బాబా మాటలు


ఉపాసినీ బాబాను  ఖండోబా ఆలయం లో నాలుగేళ్ళు  గడపమని 
బాబా ఆజ్ఞాపించారు.వారు అట్లా ఉండలేక పోయారు. అందుకనే
 ఆయన బాబాకు చేప్పకుండా మూడేళ్ళ కే, ఆయన ఆశ్రమానికి
 తిరిగి వెళ్ళిపోయారు..ఉపాసనిబాబా  ఆఉన్న ముడేళ్ళలో ప్రసాదాన్ని
బాబా కు అర్పించేవారు. ఒక  రోజున  బాబా కు ప్రసాదం  తీసుకు వస్తుంటె ఆకలిగా యున్న కుక్కకు  పెట్టకుండా వస్తాడు. .నీవు నాకు ఆ  ప్రసాదంతెచ్చి పెట్టటం  ఎందుకు ?  ఆ కుక్క  నేను ఒకటె.అని చెప్పాడు .బాబా సర్వ జీవులలోను నేనే ఉన్నానని , పిపిలికాదిబ్రహ్మ పర్యంతం అందరిని, అన్నిటిని  చూస్తున్నాఅన్ని నేనేనని  తెలిపాడు .

Thursday, May 31, 2012

Baba Maatalu

గురువు యొక్క  కృపయే ముక్తికి  మూలము.
గురు భోధనలుతెలుసుకోవాలి . శ్రవణము 
 చేయవలెను.విన్న విషయములను  అనగా 
 శ్రవణ విషయములను మననము చేయవలెను.
  అలా  గుర్తు  చేసుకొంటూ ఆచరణలో ఉండాలి
ఈ చెప్పిన విషయములను మనస్సులో 
  ఉంచుకోవాలి. దీనినే నిధి ద్యాస  అంటారు . 


Monday, May 28, 2012

Baba Maatalu

నా ఖజానా  నిండుగా నున్నది .
యవరికేది కావలసిన దానిని 
వారికివ్వగలను. కాని వానికి 
పుచ్చుకొను యోగ్యత కలదా
లేదా  యని నేను  మొదట 
పరీక్షించవలెను. నేను 
చెప్పినదానిని  జాగ్రత్హగా విన్నచో నీవు తప్పక మేలు పోం దెదవు.
ఈ మసీద్ లో కూర్చొని  నేనెప్పుడు అసత్యములు  పలకను .


Saturday, May 26, 2012

Baba Maatalu

మంనస్సు నిలకడగా నుంచుము . నా మాటలు యందు  విశ్వాసము 
ఉంచుము. నా లీలలు  శ్రద్ద  భక్తులతో  వానిని  విన్నవారికి  ప్రపంచము 
 యందు వ్యామోహము  నశించును.  బలమైన ప్రేమ భక్తి కిరటములు
లేచును .  యవరైతే నా లీలలలో మునిగెదరో  వారికీ  జ్ఞాన రత్నములు 
లభించును.నా లీలలు విను వారికి శాంతి కలుగును .   'సాయి సాయి '
యను నామమును జ్ఞప్తి  యందుంచుకొన్నంత మాత్రాన 
చెడు పలుకుటవలన, వినుటవలన కలుగు పాపములు  తొలగి 
పోవును.  

Friday, May 25, 2012

Baba Maatalu

ఎవరయితే  వారి యంత్యదశయందు నన్నే జ్ఞప్తియందుంచుకొందురో  
వారు  నన్ను చేరెదరు.  ఎవరయితే  ఏదో  మరొక  దానిని ద్యానించేదరో
వారు దానినే  పొందేదరు.కనుక మనస్సును నిలకడగా  మంచి ఆలోచన 
యందే నిలువ  వలెనన్న  నిత్యము ద్యానము చేయుచు భగవన్నామ 
స్మరణ చేసినచో  మరణ కాలమందు గాబరా పడకుండా ఉండగలము 
   

Thursday, May 24, 2012

BABA MAATALU

ఎవరు  నన్ను ఎక్కువగా  ప్రేమించెదరో  వారు ఎల్లప్పుడు  నన్ను దర్శించెదరు.
నీను లేక ఈ జగత్హు  అంతయు శూన్యము. నా కధలు తప్ప మరేమీ  చెప్పడు.
సదా నన్నే ద్యానము చేయును. నా నామమే ఎల్లప్పుడు జపించుచుండును.
యవరయితే సర్వస్య శరణాగతి చేసి , నన్నే ద్యానింతురో వారికి నేను ఋణస్తుడను.
వారికి మోక్షము నిచ్చి  వారి ఋణము  తీర్చుకోనేదను. యవరయితే  నన్నే 
చింతించుచు, నా గూర్చియే  దీక్షతో నుందురో , నాకు   అర్పిచనదే  ఏమియు 
తినరో అట్టివారిఫై నేను ఆధారపడి యుండును .ఎవరు నాసన్నిధానమునకు
వచ్చెదరో  వారు నది సముద్రములో  కలసిపోయినట్లు నాలో కలసిపోవుదురు .
  

Friday, May 4, 2012

బాబా మాటలు

ఆత్మసాక్షాత్కారామునకు దారిని  మనమే  వెదుకు కొని ప్రయాణము  సాగించవలెను.
నిత్యా నిత్యములకు భేదమును   తెలిసికొని , ఇహలోక  పరలోకములలోని  విషయ సుఖములను
త్యజించి  మన బుద్దిని, మనస్సును , స్వాదీనముంచుకొని మోక్షమునకై    కాంక్షిం చవలెను .
ఇతురుల ఫై   నాదరపడుట కంటే  మన  స్వశక్తియందే మనకు  పూర్తి నమ్మకము ఉండవలెను
ఎప్పుడయితే మనము నిత్యానిత్యములకు  గల భేదము పాటించేదమో ,ప్రపంచం  అబద్దమని
తెలుసుకొనవలెను. దాని వలన  ప్రపంచ విషయము లందు  మోహము  తగ్గి, మనకు నిర్వ్మోహము 
కలుగును.  గురువే పరబ్రహ్మ  స్వరూపమని  గ్రహించెదము.  మనము బ్రహ్మమును 
లేదా గురువును హృదయ పూర్వకముగా  ద్యానిం చెదమో    మనము కూడా  వారిలో
ఐక్యమయి   ఆత్మసాక్షాత్కారాము కలుగును .    
   

Friday, April 27, 2012

బాబా మాటలు

                    ఆత్మజ్ఞాన  సాధనకు  శ్రద్ధ  సబూరి  [ విశ్వాసం, సహనఎంతో అవసరము                          
                   గురు దృష్టి  తాబేలు దృష్టి వంటిది.  తాబేలు కేవలం తన  దృష్టి తోనే    
                 తన పిల్లలను పెంచి పెద్ద చేస్తున్నది. పిల్ల తాబేలు ఒక ఒడ్డున ఉంటె - తల్లి  తాబేలు 
                  రెండవ ఒడ్డున ఉండి దృష్టిని  ప్రసాదించి  పెంచి పెద్ద చేస్తున్నది. అలాగే   గురువు
                   కూడ  తన  తమ దృష్టి  నిల్పి ప్రేమతో కాపాడుతారు........సాయి బాబా .  

Wednesday, April 25, 2012

బాబా మాటలు

మనస్సును, ఇంద్రియములు స్వదీనము లో ఉంచుకొనవలెను.
శేరీరము - రధము;   ఆత్మ దాని యజమాని ;  బుద్ది -రధము
నడుపు సారధి; మనస్సు - కళ్ళెము;  ఇంద్రియ  విషయములు -
వాణి మార్గము .  ఎవరి మనస్సు  చంచలమై నదో, ఎవరి ఇంద్రియములు
అస్వాదీనములో ఉండునో  వాడు గమ్యస్తానము చేరలేడు. అట్టివాడు
చావు పుటుకల  చక్రంలో పడిపోవును.  ఎవరికి  గ్రహించు శక్తీ  కలదో,
ఎవరి మనస్సు స్వాదీన మందున్నధో , ఎవరి ఇంద్రియములు  
 స్వాదీనముండునో, ఎవడు తన బుద్దిని  మార్గదర్శిగా  గ్రహించి  తన 
మనస్సును పగ్గము తో లాగి  పట్టుకోనగలడో వాడు తన గమ్య స్తానము 
చేరుకో గలడు, 

Sunday, April 22, 2012

బాబా మాటలు

                          భక్తి విశ్వాసములు అనెడి హృదయ దీపమును సరిచేసుకోనవలెను
                          ప్రీమ యను వత్తిని వెలిగించవలెను. అట్లు  చేసిన యడల  జ్ఞానమనే 
                             జ్యోతి  [ ఆత్మ సాక్షాత్కారము ] వెలిగి  ఎక్కువ తేజస్సు  ప్రకాశించను
                             ప్రీమ లేని  జ్ఞానము ఉత్తది.  అట్టి జ్ఞానము ఎవ్వరికి అక్కరలేదు .
                             ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్చిన్న మైన 
                            అపరిమితమైన ప్రేమ ఉండవలెను.యదార్ధ మైన  కాంక్ష ,ఉత్తమమైన 
                            భావము  ఉన్నచోటనే భగవంతుడు తానై సాక్షాత్కారిం చును.అదియే
                            ప్రేమ. అదియే  మోక్ష మునకు మార్గము.

Thursday, March 22, 2012

బాబా మాటలు

            నేను సమాధి చెందినప్పటికీ  నా సమాధి  లో  నుంచి  నా ఎముకలు  మాట్లాడును.
            మనః పూర్వకంగా  నన్ను   శేరణు   జొచ్చిన  వారితో  నా సమాధి  కూడా  మాట్లాడును
            వారి  వెన్నంటి  కదులును.  నా ఎముకలు  మాట్లాడుచు  మీ క్షేమమును కనుగొను
             చుండును. ఎల్లప్పుడు  నన్నే  జ్ఞప్తియందుంచుకొనుడు.  నా యందే   మనః  పూర్వకంగా 
            హృదయపూర్వకంగా  నమ్మకము  ఉంచిన  యడల  మీరు  మిక్కిలి మేలు  పోందెదురు .
          

Sunday, March 18, 2012

బాబా మాటలు


నేను సాక్షి భూతుడను మాత్రమే.  చేయువాడు ప్రేరేపించువాడు  దేవుడే. వారు  మిక్కిలి దయార్ద్ర హృదయములు.  నేను భగవంతుడను  కాను. ప్రభువును  కాను.  నేను వారి 
నమ్మకమైన  భంటును. వారి నెల్లప్పుడు జ్ఞాపకము  చేయుచుందును.  ఎవరయితే  తమ 
యహంకారమును  ప్రక్కకు దోసి  భగవంతునికి  నమస్కరించేదరో ,  ఎవరు  వారిని                                    పూర్తిగా నమ్మెదరో, వారి భంధము లూడి మోక్షమును  పోందెదరు.....సాయి బాబా          

Friday, March 16, 2012

baba maatalu

దైవము  యిచ్చునది  శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది 
దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు " తీసుకో, తీసుకో "అనును  కాని
ప్రతివాడు నా వద్దకు  వచ్చి  ' తే తే 'యనుచున్నాడు.  నా సర్కారు 
యొక్క  ఖజానా  నిండుగా   నున్నది.  అది  అంచు  వరకు  నిండి 
పొంగిపోవుచున్నది. నేను  "త్రవ్వి  ఈ ధనమును  బండ్లతో
తీసుకపొండు.ఈ ద్రవ్యమును  నంతయు  దాసుకోనవలెను.
..................... షిర్డీ  సాయి బాబా

Tuesday, March 13, 2012

బాబా మాటలు


నా మనుష్యుడు ఎంత  దూరమున్న నున్నప్పటికి  1000      క్రోసుల  దూరమున
నున్నప్పటికి  పిచుక  కాళ్ళకు  దారము కట్టి  యీడ్చినటుల  అతనని
శిరిడీకి  లాగెదను.......నాకు  ప్రవేశించుటకు  వాకిలి యవసరము  లేదు.
నాకు రూపము  లేదు.  ఎవరితే   నన్నే  నమ్మి  నా ద్యానము  నందే
మునిగి  యందురో  వారి పనులన్నియు  సూత్ర దారినై  నేనే నడిపించేదను.  

Sunday, March 11, 2012

బాబా మాటలు

నవవిధ భక్తులు ; వీనిలో నేదయినా ఒక  మార్గమును  హృదయపూర్వకముగా అనుసరించిన
యడల భగవంతుడు సంతుష్ట్టి చెందును. భక్తి లేని సాధనములన్నియు.......అనగా  జపము ,
తపము, యోగము,ఆద్యాత్మిక గ్రంధములు పారాయణ, వానిలోని సంగతులు  నితురులకు
భోదించుట, మొదలగునవి ......నిష్ప్రయోజనము.  భక్తియే లేనిచో  వేదములలోని  జ్ఞానము,
జ్ఞానియను  గొప్ప ప్రఖ్యాతి , నామమాత్రమునకు చేయు భజన,  ఇవన్నియు వ్యర్ధము.
కావలసినది  ప్రేమాస్పదమైన  భక్తి మాత్రమే కావలెను...............సాయి బాబా

Monday, March 5, 2012

బాబా మాటలు

నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు  మీ చెంత నేనుండెదను.
నా దేహము నిచ్చట నున్నప్పటికి సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు
నీకు  తెలియును. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే
ఉండేదను. నా నివాసస్థలము మీ హృదయము నందే గలదు.  నీను మీ శరీరము  లోనే
ఉన్నాను. ఎల్లప్పుడు మీ హృదయములలో సర్వజన హృదయముల యందు గల  నన్ను
పూజింపుము   ........................సాయి బాబా

Sunday, March 4, 2012

baba maatalu




భగవత్ సాన్నిద్యమునకు ప్రోవుటకు  కర్మ,జ్ఞాన, యోగ, భక్తి మార్గములనెడి  
నాలుగు త్రోవలు గలవు. అన్నింటిలో భక్తి  మార్గము కష్టమయినది. అది 
ముండ్లు గ్రోతులు నిండి యుండును. సద్గురుని సహాయముతో ముండ్లను 
గోతులను తప్పించుకొని  ముందుకు సాగినచో  గమ్యస్థానము అవలీలగా 
చేరవచ్చును...............................సాయి బాబా  

Saturday, February 25, 2012

baba maatalu

        ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారి కోరికలు  తీర్చెదను .వారిని నలుదిశల కాపాడెదను
        నా లీలలు గానము చేయువారికంతులేని  యానందము  శాస్వతమైన  తృప్తిని  ఇచ్చెదనని
        నమ్ముము. ఎవరైతే నన్నుపూజించెదరో ,స్మరించెదరో, నా రూపమును తమ  మనస్సున
        నిలుపుకొనేదరో వారిని దుఃఖబంధనములనుండి ప్రాపంచిక విషయములననింటిని  మరచి
          నా నామమే జపించుచు , నా పూజనే సలుపుచు, నా లీలలను, చరిత్రను మననము
          చేయుచు ఎల్లప్పుడు  నన్నే జ్ఞప్తి యందు౦చుకొనువారిని సకలరోగములు నుండి కాపాడెదను ,

Tuesday, February 21, 2012

baba maatalu

ఎవరు సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య  శరణాగతి పొందేదురో వారు
దేవునితో ఐక్యముచెందేదురు. వారికి  దేనితో  సంబంధముగాని, బేధభావము గాని
ఉండదు . వారికీ జాతి మతములతో గాని నెట్టి సంబంధము వుండదు ...........సాయిబాబా

Saturday, February 18, 2012

బాబా మాటలు

నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుదూ బాధపదనవసరములేదు .నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్దలతో మానఃపూర్వకంగా  నన్నే ఆరాధించువారి  యోగ సమాచారములు  నేను చూచెదను .ఎల్లప్పుడు
నన్నే గుర్తు  ఉంచుకోనుము.మనసును ధనసంపార్జనము, దేహ పోషణ గృహ సంరక్షణ పట్ల సంచరించాగుండా
ఉండాలి .





Sunday, February 12, 2012

baba maatalu

మీరెక్కడ  ఉన్న  ఏమి  చేయుచున్న నాకు  అన్ని తెలుయును. నేను అందరిహృదయములు                      పాలించువాడను.అందరి హృదయాలలో నివసించువాడను.నేను ప్రపంచమందుగల  చరాచరకోటి 
నావరించివునాను.  ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే .సృష్టి  సితి లయకారకుడను
నేనే.ఎవరతే  తమ దృష్టిని నావైపు  త్రిప్పెదరో  వారి కేహాని గాని భాధగాని  కలుగదు. నన్ను మరచిన
వారిని మాయ బాదపెట్టును ..................................షిర్డీ సాయి బాబా
     

Friday, February 10, 2012

బాబా మాటలు


భయపడకు తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము .అనగా  జ్ఞానమును విడువకుము.మనస్సును కేంద్రీకరించుము. దూరముగా  పోనీయకు
అంతరాత్మను  చూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము నీవు
తప్పక  రక్షింప బడెదవు    
              
తిరుగలి క్రింది రాయీ    :  కర్మ
మీద రాయీ                 : భక్తి
తిరుగలి మీద పిడి        :  జ్ఞానమ

Tuesday, February 7, 2012

బాబా మాటలు

నా బక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడు లోటుండదు నా యందే మనస్సు నిలిపి భక్తి శ్రద్దలతో మనః పూర్వకంగా నన్నే యారాధించు వారి యోగ సమాచారాలు నేనే చూస్తాను

Monday, January 23, 2012

బాబా మాటలు

షిర్డీ సాయి బాబా నేనెవరి చెవిలో ఏది ఉపదేసిచలేదు. మా సంప్రదాయం వేరు అని అనేవారు