Sunday, June 17, 2012

బాబా మాటలు

నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించితిని.  నేను వారిని చూచునపుడు వారు 
 గొప్ప  ధ్యానములో వుండునట్లు కనిపించిరి.మేమిద్దరమూఆనందములో మునేగేడివారము.
  రాత్రింబవళ్ళు నిద్రాహారములు  లేక నేను వారి వేపు  దృష్టి నిగిడ్చితిని.    వారినిచూడనిచో 
 నాకు శాంతి లేకుండెను. వారే  నాఆశ్రయము.  నా మనస్సు  ఎల్లప్పుడు  వారి యందే 
నాటుకొని  యుండెడిది .ఇదియే ఒక పైస  దక్షణ .    సాబురి  అనునది రెండవ పైస.
  రాత్రింబవళ్ళు  నిద్రాహరములు  మరచి గురువు వైపు దృష్టిని స్థిరము చేయవలెను. 
మనస్సు ఎల్లప్పుడు వారి యందేవుండవలెను . వారి  ద్యానము , వారి సేవ అనగా 
 వారు చెప్పిన మాటలు ఆచరించుటయే  వారి  సేవ . గురువు చెప్పినట్లు జీవితమందు
 నడుచుకోనవలెను.  అదియే  గురుసేవ.గురువు చెప్పిన  మాటను ఆచరించుటయే  గురుదక్షణ .
 దానినే  నిస్ట్ట  అనెదరు ,  

No comments:

Post a Comment