ఆద్యంతాలు లేని యీ పాదాలు పరమ పవిత్రమైనవి . నాపై పూర్తి
విశ్వాసముంచు , నీ కోరిక నెరవేరుతుంది . నా పై నీ దృష్టి నిలుపుము .
నేనూ నీపై దృష్టి నిలుపుతాను . నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను .
నన్ను నమ్మినవారిని పతనం కానివ్వను. నన్నే ధ్యానించి , నా లీలలు
గానం చేసేవారు నేనుగా మారిపోతారు ; వారి కర్మ నశిస్తుంది. నేను
వారి చెంతనే వుంటాను . నా సమాధి నన్నాశ్రయించిన వారితో
మాట్లాడుతుంది . నా సమాధి నుంచి నుండి నా కర్తవ్యం నిర్వహిస్తాను .
నా నామం పలుకుతుంది . నా మట్టి సమాధానము చెబుతుంది .
No comments:
Post a Comment