Friday, May 4, 2012

బాబా మాటలు

ఆత్మసాక్షాత్కారామునకు దారిని  మనమే  వెదుకు కొని ప్రయాణము  సాగించవలెను.
నిత్యా నిత్యములకు భేదమును   తెలిసికొని , ఇహలోక  పరలోకములలోని  విషయ సుఖములను
త్యజించి  మన బుద్దిని, మనస్సును , స్వాదీనముంచుకొని మోక్షమునకై    కాంక్షిం చవలెను .
ఇతురుల ఫై   నాదరపడుట కంటే  మన  స్వశక్తియందే మనకు  పూర్తి నమ్మకము ఉండవలెను
ఎప్పుడయితే మనము నిత్యానిత్యములకు  గల భేదము పాటించేదమో ,ప్రపంచం  అబద్దమని
తెలుసుకొనవలెను. దాని వలన  ప్రపంచ విషయము లందు  మోహము  తగ్గి, మనకు నిర్వ్మోహము 
కలుగును.  గురువే పరబ్రహ్మ  స్వరూపమని  గ్రహించెదము.  మనము బ్రహ్మమును 
లేదా గురువును హృదయ పూర్వకముగా  ద్యానిం చెదమో    మనము కూడా  వారిలో
ఐక్యమయి   ఆత్మసాక్షాత్కారాము కలుగును .    
   

No comments:

Post a Comment