Saturday, July 7, 2012

బాబా మాటలు

1912    సంవత్సరము లో  బొంబాయి నుండి  డాక్టర్  రామారావు కొతారే  యను నతడు
షిర్డీ వచ్చెను .అతని మిత్రుడు ఐన  భాయికృష్ణాజీ  అలీ బాగకర్ అను నతడు  వెంట వచ్చెను ..
షిర్డీ లో వారు సగుణ్  మేరు నాయక్ , జి .కే .దీక్షిత్  కు సన్నిహితులైరి.   అనేక విషములు 
తమలో చర్చించుకొనునప్పుడు సంభాషణ  వసాస్తూ   మొట్టమొదట షిర్డీ లో ప్రకటమై ,
 తన గురుస్థానమని  చెప్పిన  వేపచెట్టు  క్రింద పాదుకలు ప్రతిష్టించవలెననని   నిశ్చ యించుకోనిరి .
పాదుకల నమూనా తో ఖండోబా మందిరముందున్న శ్రీ ఉపాసనీ మహారాజ్  వద్దకు  పోగా
కొన్ని మార్పులు  చేసి  పద్మము , శంఖము , చక్రము,చేర్చి  బొంబాయి  లో చేయించిరి.
శ్రావణ పౌర్ణిమ రోజున ఉదయం 11గంటలకు  జి. కే. దీక్షిత్ తన శిరస్సు   పై  పాదుకలు 
 పెట్టుకొని  ఖండోబా  మందిరం  నుండి  ద్వారకా మాయి కి  ఉత్సవముతో  వచ్చిరి .  బాబా
యా పాదుకలు స్పృశించి అవి భగవంతుని పాదుకలని చెప్పిన  తరువాత  ఆ పాదుకలను 
వేపచెట్టు  క్రింద  ప్రతిష్టించిరి . అప్పటిలో  దీక్షిత్  పాదుకలకు  నిత్య పూజ చేసినారు .నేటికి 
2012   సంవత్సరము , శ్రావణ పౌర్ణిమనకు, గురుస్థానము లో  పాదుకలు   ప్రతిష్టించి
100  సంవత్సరములు పూర్తి వుతుంది .                 జై సాయి రామ్...
             

No comments:

Post a Comment