నేను ఒక రూపాయి దక్షణ ఎవరి వద్ద నుండి గాని తీసికోనినచో
దానికి నేను పది రెట్లు ఇవ్వవలెను.నేనూరక ఏమి తీసికొనను.
యుక్తాయుక్తములు తెలియకుండ నేనెవరిని అడగను.ఎవరైన
ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ యున్నచో వానివద్దనే నేను
ధనము పుచ్చుకొందును.దానము చేయువాడిచ్చునది
ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది. అది మునుముందు
గొప్ప పంట అనుభవించుట కొరకే . ధర్మము చేయుటకు
ధనముప యోగించవలెను.దక్షిణ ఇచ్చుచున్నచో
వైరాగ్యము పెరుగును.దానివలన భక్తి జ్ఞానములు కలుగును.
No comments:
Post a Comment