Thursday, May 31, 2012

Baba Maatalu

గురువు యొక్క  కృపయే ముక్తికి  మూలము.
గురు భోధనలుతెలుసుకోవాలి . శ్రవణము 
 చేయవలెను.విన్న విషయములను  అనగా 
 శ్రవణ విషయములను మననము చేయవలెను.
  అలా  గుర్తు  చేసుకొంటూ ఆచరణలో ఉండాలి
ఈ చెప్పిన విషయములను మనస్సులో 
  ఉంచుకోవాలి. దీనినే నిధి ద్యాస  అంటారు . 


Monday, May 28, 2012

Baba Maatalu

నా ఖజానా  నిండుగా నున్నది .
యవరికేది కావలసిన దానిని 
వారికివ్వగలను. కాని వానికి 
పుచ్చుకొను యోగ్యత కలదా
లేదా  యని నేను  మొదట 
పరీక్షించవలెను. నేను 
చెప్పినదానిని  జాగ్రత్హగా విన్నచో నీవు తప్పక మేలు పోం దెదవు.
ఈ మసీద్ లో కూర్చొని  నేనెప్పుడు అసత్యములు  పలకను .


Saturday, May 26, 2012

Baba Maatalu

మంనస్సు నిలకడగా నుంచుము . నా మాటలు యందు  విశ్వాసము 
ఉంచుము. నా లీలలు  శ్రద్ద  భక్తులతో  వానిని  విన్నవారికి  ప్రపంచము 
 యందు వ్యామోహము  నశించును.  బలమైన ప్రేమ భక్తి కిరటములు
లేచును .  యవరైతే నా లీలలలో మునిగెదరో  వారికీ  జ్ఞాన రత్నములు 
లభించును.నా లీలలు విను వారికి శాంతి కలుగును .   'సాయి సాయి '
యను నామమును జ్ఞప్తి  యందుంచుకొన్నంత మాత్రాన 
చెడు పలుకుటవలన, వినుటవలన కలుగు పాపములు  తొలగి 
పోవును.  

Friday, May 25, 2012

Baba Maatalu

ఎవరయితే  వారి యంత్యదశయందు నన్నే జ్ఞప్తియందుంచుకొందురో  
వారు  నన్ను చేరెదరు.  ఎవరయితే  ఏదో  మరొక  దానిని ద్యానించేదరో
వారు దానినే  పొందేదరు.కనుక మనస్సును నిలకడగా  మంచి ఆలోచన 
యందే నిలువ  వలెనన్న  నిత్యము ద్యానము చేయుచు భగవన్నామ 
స్మరణ చేసినచో  మరణ కాలమందు గాబరా పడకుండా ఉండగలము 
   

Thursday, May 24, 2012

BABA MAATALU

ఎవరు  నన్ను ఎక్కువగా  ప్రేమించెదరో  వారు ఎల్లప్పుడు  నన్ను దర్శించెదరు.
నీను లేక ఈ జగత్హు  అంతయు శూన్యము. నా కధలు తప్ప మరేమీ  చెప్పడు.
సదా నన్నే ద్యానము చేయును. నా నామమే ఎల్లప్పుడు జపించుచుండును.
యవరయితే సర్వస్య శరణాగతి చేసి , నన్నే ద్యానింతురో వారికి నేను ఋణస్తుడను.
వారికి మోక్షము నిచ్చి  వారి ఋణము  తీర్చుకోనేదను. యవరయితే  నన్నే 
చింతించుచు, నా గూర్చియే  దీక్షతో నుందురో , నాకు   అర్పిచనదే  ఏమియు 
తినరో అట్టివారిఫై నేను ఆధారపడి యుండును .ఎవరు నాసన్నిధానమునకు
వచ్చెదరో  వారు నది సముద్రములో  కలసిపోయినట్లు నాలో కలసిపోవుదురు .
  

Friday, May 4, 2012

బాబా మాటలు

ఆత్మసాక్షాత్కారామునకు దారిని  మనమే  వెదుకు కొని ప్రయాణము  సాగించవలెను.
నిత్యా నిత్యములకు భేదమును   తెలిసికొని , ఇహలోక  పరలోకములలోని  విషయ సుఖములను
త్యజించి  మన బుద్దిని, మనస్సును , స్వాదీనముంచుకొని మోక్షమునకై    కాంక్షిం చవలెను .
ఇతురుల ఫై   నాదరపడుట కంటే  మన  స్వశక్తియందే మనకు  పూర్తి నమ్మకము ఉండవలెను
ఎప్పుడయితే మనము నిత్యానిత్యములకు  గల భేదము పాటించేదమో ,ప్రపంచం  అబద్దమని
తెలుసుకొనవలెను. దాని వలన  ప్రపంచ విషయము లందు  మోహము  తగ్గి, మనకు నిర్వ్మోహము 
కలుగును.  గురువే పరబ్రహ్మ  స్వరూపమని  గ్రహించెదము.  మనము బ్రహ్మమును 
లేదా గురువును హృదయ పూర్వకముగా  ద్యానిం చెదమో    మనము కూడా  వారిలో
ఐక్యమయి   ఆత్మసాక్షాత్కారాము కలుగును .