Thursday, March 22, 2012

బాబా మాటలు

            నేను సమాధి చెందినప్పటికీ  నా సమాధి  లో  నుంచి  నా ఎముకలు  మాట్లాడును.
            మనః పూర్వకంగా  నన్ను   శేరణు   జొచ్చిన  వారితో  నా సమాధి  కూడా  మాట్లాడును
            వారి  వెన్నంటి  కదులును.  నా ఎముకలు  మాట్లాడుచు  మీ క్షేమమును కనుగొను
             చుండును. ఎల్లప్పుడు  నన్నే  జ్ఞప్తియందుంచుకొనుడు.  నా యందే   మనః  పూర్వకంగా 
            హృదయపూర్వకంగా  నమ్మకము  ఉంచిన  యడల  మీరు  మిక్కిలి మేలు  పోందెదురు .
          

Sunday, March 18, 2012

బాబా మాటలు


నేను సాక్షి భూతుడను మాత్రమే.  చేయువాడు ప్రేరేపించువాడు  దేవుడే. వారు  మిక్కిలి దయార్ద్ర హృదయములు.  నేను భగవంతుడను  కాను. ప్రభువును  కాను.  నేను వారి 
నమ్మకమైన  భంటును. వారి నెల్లప్పుడు జ్ఞాపకము  చేయుచుందును.  ఎవరయితే  తమ 
యహంకారమును  ప్రక్కకు దోసి  భగవంతునికి  నమస్కరించేదరో ,  ఎవరు  వారిని                                    పూర్తిగా నమ్మెదరో, వారి భంధము లూడి మోక్షమును  పోందెదరు.....సాయి బాబా          

Friday, March 16, 2012

baba maatalu

దైవము  యిచ్చునది  శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది 
దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు " తీసుకో, తీసుకో "అనును  కాని
ప్రతివాడు నా వద్దకు  వచ్చి  ' తే తే 'యనుచున్నాడు.  నా సర్కారు 
యొక్క  ఖజానా  నిండుగా   నున్నది.  అది  అంచు  వరకు  నిండి 
పొంగిపోవుచున్నది. నేను  "త్రవ్వి  ఈ ధనమును  బండ్లతో
తీసుకపొండు.ఈ ద్రవ్యమును  నంతయు  దాసుకోనవలెను.
..................... షిర్డీ  సాయి బాబా

Tuesday, March 13, 2012

బాబా మాటలు


నా మనుష్యుడు ఎంత  దూరమున్న నున్నప్పటికి  1000      క్రోసుల  దూరమున
నున్నప్పటికి  పిచుక  కాళ్ళకు  దారము కట్టి  యీడ్చినటుల  అతనని
శిరిడీకి  లాగెదను.......నాకు  ప్రవేశించుటకు  వాకిలి యవసరము  లేదు.
నాకు రూపము  లేదు.  ఎవరితే   నన్నే  నమ్మి  నా ద్యానము  నందే
మునిగి  యందురో  వారి పనులన్నియు  సూత్ర దారినై  నేనే నడిపించేదను.  

Sunday, March 11, 2012

బాబా మాటలు

నవవిధ భక్తులు ; వీనిలో నేదయినా ఒక  మార్గమును  హృదయపూర్వకముగా అనుసరించిన
యడల భగవంతుడు సంతుష్ట్టి చెందును. భక్తి లేని సాధనములన్నియు.......అనగా  జపము ,
తపము, యోగము,ఆద్యాత్మిక గ్రంధములు పారాయణ, వానిలోని సంగతులు  నితురులకు
భోదించుట, మొదలగునవి ......నిష్ప్రయోజనము.  భక్తియే లేనిచో  వేదములలోని  జ్ఞానము,
జ్ఞానియను  గొప్ప ప్రఖ్యాతి , నామమాత్రమునకు చేయు భజన,  ఇవన్నియు వ్యర్ధము.
కావలసినది  ప్రేమాస్పదమైన  భక్తి మాత్రమే కావలెను...............సాయి బాబా

Monday, March 5, 2012

బాబా మాటలు

నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు  మీ చెంత నేనుండెదను.
నా దేహము నిచ్చట నున్నప్పటికి సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు
నీకు  తెలియును. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే
ఉండేదను. నా నివాసస్థలము మీ హృదయము నందే గలదు.  నీను మీ శరీరము  లోనే
ఉన్నాను. ఎల్లప్పుడు మీ హృదయములలో సర్వజన హృదయముల యందు గల  నన్ను
పూజింపుము   ........................సాయి బాబా

Sunday, March 4, 2012

baba maatalu




భగవత్ సాన్నిద్యమునకు ప్రోవుటకు  కర్మ,జ్ఞాన, యోగ, భక్తి మార్గములనెడి  
నాలుగు త్రోవలు గలవు. అన్నింటిలో భక్తి  మార్గము కష్టమయినది. అది 
ముండ్లు గ్రోతులు నిండి యుండును. సద్గురుని సహాయముతో ముండ్లను 
గోతులను తప్పించుకొని  ముందుకు సాగినచో  గమ్యస్థానము అవలీలగా 
చేరవచ్చును...............................సాయి బాబా