Friday, February 12, 2016

బాబా మాటలు

జై సాయి రామ్ ,ఆద్యాత్మిక  పరంపరలో మహాత్ములు ప్రకటం కావటం,నిష్ష్క్రమించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం . అన్ని కాలాలలోనూ మహాత్ములు,సిద్ద పురుషులు ఉంటూనే ఉంటారు . వారు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులు నెరవేరుస్తారు . వారు   అనేకచోట్ల పనిచేసినా అందరు భగవంతుని ఆజ్ఞనుసారంగా నడుచుకుంటారు .

శ్రీ గజాననమహారాజ్ 1910 వినాయకచతుర్ది రోజున  మహసమాధి చెందారు.  వీరు సమాధి చెందినా ఏడున్నర సంవతసరాలకు 1918అక్టోబర్15న  శ్రీ షిర్డిసాయి బాబా   మహసమాధి చెందారు .  శ్రీ షిర్డిసాయి బాబా   మహసమాధి చెందిన ఏడున్నర సంవతసరాలకు శ్రీ తాజుద్దీన్ బాబా 1925 ఆగష్టు 18న మహసమాధి చెందారు. విచిత్రమేమిటంటే ఈ ముగ్గురు మహాత్ములు సమాధి చెందేనాటికి ఒక్కక్కరికి మధ్యకాలం షుమారుగా ఏడున్నరసంవతసరాలు. తరువాత 
 ఏడున్నర సంవతసరాల నాటికి శ్రీ గులాబ్ బాబా జూలై 1వ తారీకు 1932సంవతసరం లో జనించారు . శ్రీ గజాననమహారాజ్,శ్రీ షిర్డిసాయి బాబా,శ్రీ తాజుద్దీన్ బాబా,,నిష్ష్క్రమణ అనంతరం వారి ఆద్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ శ్రీ గులాబ్ బాబా రూపంలో జరుగుతున్నదని ఉత్తర భారతీయుల ప్రగాడ నమ్మకం . ఇది దత్త సంప్రదాయమని చప్పవచ్చు 

No comments:

Post a Comment