జై సాయి రామ్, నేను ఒక రూపాయి దక్షణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకొనినచో దానికి పది రెట్లు ఇవ్వవలెను . నేనూరక ఏమి తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరిని
అడగును . ఫకీరెవరిని చూపునొ వారివద్దనే నేను తీసుకొనేదను. ఎవరైన ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ యున్నచో,వాని వద్దనే ధనము పుచ్చుకొందును . దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుటవంటిది. అది మునుముందు గొప్ప పంట ఆనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనముపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్ధమయిపోవును.గతజన్మలో నీ విచ్చియుంటేనే గాని నీ విప్పుడు అనుభవించలేవు.
కనుక ధనమును పొంద వలెనన్నచొ, దానిని ప్రస్తుత మితురుల కిచ్చుటే సరియైన మార్గము, దక్షిణ యిచ్చు చున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన వైరాగ్యము పెరుగును . దానివలన భక్తి జ్ఞానములు కలుగును. శ్రీ షిర్డీ సాయి బాబా ,షిర్డీ .
No comments:
Post a Comment