Wednesday, February 17, 2016

బాబా మాటలు

జై సాయి రామ్,  నేను ఒక రూపాయి  దక్షణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకొనినచో  దానికి పది రెట్లు ఇవ్వవలెను . నేనూరక ఏమి తీసుకొనను.  యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరిని
అడగును . ఫకీరెవరిని చూపునొ వారివద్దనే నేను తీసుకొనేదను. ఎవరైన ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ యున్నచో,వాని వద్దనే ధనము పుచ్చుకొందును . దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుటవంటిది. అది మునుముందు గొప్ప పంట ఆనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనముపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్ధమయిపోవును.గతజన్మలో నీ విచ్చియుంటేనే గాని నీ విప్పుడు అనుభవించలేవు. 
కనుక ధనమును  పొంద వలెనన్నచొ, దానిని ప్రస్తుత మితురుల కిచ్చుటే సరియైన మార్గము, దక్షిణ యిచ్చు చున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన వైరాగ్యము పెరుగును . దానివలన భక్తి జ్ఞానములు కలుగును.                                                                 శ్రీ షిర్డీ సాయి బాబా ,షిర్డీ .        

Sunday, February 14, 2016

బాబా మాటలు

ఓం సాయిరామ్ ,కబీరుదాసు  తాను వ్రాసిన దోహలో ఇలా అంటారు . నేడు చెడ్డ  వాడెవడో              చూద్దామని   ప్రపంచం  అంత  గాలించాను . కానీ ఒక్కడు కూడా దుర్మార్గుడు కనిపించలేదు. ప్రతి వాని లో నాకు ఏదో ఒక మంచితనమే గోచరించింది . విసుకుచెంది నా మనస్సులోకి తొంగి చూస్తే  అన్ని దుర్గుణాలు నా లోనె  ఉన్నట్లు,నన్ను మించిన దుష్టుడెవరు లేనట్లు అనిపించింది .                                                     





Friday, February 12, 2016

బాబా మాటలు

జై సాయి రామ్ ,ఆద్యాత్మిక  పరంపరలో మహాత్ములు ప్రకటం కావటం,నిష్ష్క్రమించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం . అన్ని కాలాలలోనూ మహాత్ములు,సిద్ద పురుషులు ఉంటూనే ఉంటారు . వారు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులు నెరవేరుస్తారు . వారు   అనేకచోట్ల పనిచేసినా అందరు భగవంతుని ఆజ్ఞనుసారంగా నడుచుకుంటారు .

శ్రీ గజాననమహారాజ్ 1910 వినాయకచతుర్ది రోజున  మహసమాధి చెందారు.  వీరు సమాధి చెందినా ఏడున్నర సంవతసరాలకు 1918అక్టోబర్15న  శ్రీ షిర్డిసాయి బాబా   మహసమాధి చెందారు .  శ్రీ షిర్డిసాయి బాబా   మహసమాధి చెందిన ఏడున్నర సంవతసరాలకు శ్రీ తాజుద్దీన్ బాబా 1925 ఆగష్టు 18న మహసమాధి చెందారు. విచిత్రమేమిటంటే ఈ ముగ్గురు మహాత్ములు సమాధి చెందేనాటికి ఒక్కక్కరికి మధ్యకాలం షుమారుగా ఏడున్నరసంవతసరాలు. తరువాత 
 ఏడున్నర సంవతసరాల నాటికి శ్రీ గులాబ్ బాబా జూలై 1వ తారీకు 1932సంవతసరం లో జనించారు . శ్రీ గజాననమహారాజ్,శ్రీ షిర్డిసాయి బాబా,శ్రీ తాజుద్దీన్ బాబా,,నిష్ష్క్రమణ అనంతరం వారి ఆద్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ శ్రీ గులాబ్ బాబా రూపంలో జరుగుతున్నదని ఉత్తర భారతీయుల ప్రగాడ నమ్మకం . ఇది దత్త సంప్రదాయమని చప్పవచ్చు