Shirdi Prasad
Monday, June 13, 2016
Friday, March 25, 2016
బాబా భక్తులు-
రాధా కృష్ణఆయి
రాధా కృష్ణఆయి మొదటిసారి నానాసాహెబ్ చందోర్కర్ తో కలసి 1905 లో షిర్డీ కి వచ్చెను . ఆమె అసలు పేరు సుందరీ భాయి క్షీరసగర్. చిన్నతనములోనే భర్త మరణించుట వలన భంధు కోటిని ,కుటుంభ సభులను సభ్యులను వదలి భగవంతుని సేవలో కాలము గడపినది . మొదటనుండి ఆమె కృష్ణ భక్తురాలు. నిరంతరము కృష్ణ నామమును జపించుట వలన ఆమెకు రాధా కృష్ణఆయి అని పేరు వచ్చినది . ఆమె ఎల్లప్పుడు కృష్ణ విగ్రహం దగ్గర ఉంచుకొని అన్ని సపర్యలు చేస్తూ ,తరుచు పండరిపురం దర్శిస్తుండేది . తదుపరి ఆమె శిర్దిలో తన సమయమంతా సాయి సేవలోను త్రీవ్రమైన సాధన లో గడిపేది.
రాధా కృష్ణఆయి, బాబా సంచరించు మార్గము లన్నియు స్వయంగా చిమ్మి నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టేది. బాబా లెండీ తోట లోకి ,లేదా చావడి లోనికి వెళ్ళినప్పుడు మసీద్ చిమ్మేది, మరియు మసి బారిన గోడలు శుభ్రంగా చేసేది. బాబా తాను మధ్యాహ్నం బిక్ష కు వెళ్లి వచ్చిన తరువాత శ్యామా ద్వారా ఆమెకు ఒక రొట్టె , కూర నిత్యం పంపేవారు
అదే, ఆమె గురుబిక్షగా స్వీకరించేడిది. ఆమె ఇంటిని'శాల'అనేవారు . అంటే బడి అని అర్ధం. రాధా కృష్ణఆయిఇంటినుండి బయటకు వెళ్ళునప్పుడు ముఖం నిండుగా ముసుకు కప్పుకొని వెళ్ళేది. ఎన్నో మాసాలు శిర్దిలో ఉన్న ఖపర్డే , ముసుకు లేకుండా ఆమెను చూడలేదని తన డైరీ లో వ్రాసుకొన్నారు . కొందరు భక్తులను ఆమె ఇంటివద్ద బస చేయమని బాబా చెప్పెడివారు .
వామన్ రావ్ పాటిల్ ఎప్పుడు షిర్డీ వచినా ' ఆయ ' వద్ద గడిపేవాడు. ఆమె మాట్లాడే ప్రతిమాట సాయి మాటగా తలచవచ్చునని ఆయన వ్రాసారు . ఆమె ఆయనకు భోజనం చేసేటప్పుడు , సంఖ్యా యోగంలో చెప్పిన తత్వాలకు సంకేతంగా భోజనాన్ని ఎలా భావించాలో చెప్పినది. ఇంతటి భక్తురాలని సాయి తమ ఎదుటకు రానిచ్చే వారు కాదు.
పొరపాటున ఒకసారి ఎదుటపడి నప్పుడు ఆయన ఉగ్రులై ఆమెపై రాళ్ళూ విసరి , త్రీవ్రంగా తిట్టారు .
ఒకసారి శ్రీమతి తర్కాడ్ ను ఈమె ఇంట బసచేయమని సాయి చెపారు .కాని తను చెప్పిన పనులన్నీ త్రికరణ శుద్దిగా చేసేట్లయితేనే ఆమెకు ఆశ్రయమిస్తానన్నది . అందుకు అంగీకరించినది . చిన్న పొరపాటుకు ఆమె త్రీవ్రంగా చివాట్లు పెట్టేది. కాని రోజులు గడచినకొద్ది నిరంతర సాయి సేవ - సాయి ద్యానం వలన అయీ లో దివ్యదృష్టి దివ్యశ్రవణం , ఇతురుల భావాలు గ్రహించటము వంటి శక్తులను శ్రీమతి తర్కాడ్ గుర్తించినది.
రాధా కృష్ణఆయిలో బాబాపట్ల శ్రద్ద భక్తులతో పాటు విశిష్టమైన అధికారము , ఆకర్షణ ఉండేవి. ఆమె ఏదైనా చెబితే కోటేశ్వరుడైనబూటి దగ్గర నుండి అందరు తలవంచి పనిచేసినారు . బాబా నడచి వెళ్ళు లెండీ తోటకు, ఇరు వైపులా ఇనుప కమ్మీలు నాటి లతలు నాటినారు . నిత్యము నీళ్ళూ పోసి బాగా అల్లుకోనునట్లు చేసినారు .
నిజానికి రాధా కృష్ణఆయి శిర్దిలో గడిపినది తొమ్మిది సం// మాత్రమె . ఆమె తన 35వ యేట ఈ లోకం నుండి వెళ్ళిపోఇనది . మిగిలిన భక్తులు సాధించలేనిది, సాయి సంస్థాన వైభోగం ఆమె 9వసంతాలలో సాదించి నది

Sunday, March 13, 2016
బాబా మాటలు
శ్రీ సాయినాధ స్థవనమంజరి అను ఈ గ్రంధమును బాబాకు అత్యంత ప్రీతీపాత్రుడైన శ్రీ దాసుగణు మహరాజు అనువారు 9-9-1918గణేష్ చతుర్థి సోమవారం రోజున బాబా ప్రేరణ తో నర్మదా నది తీర మహేశ్వర క్షేత్రములో రచించి ,శిర్దిలో శ్రీ ద్వారకామాయీ నందు సుఖా సీనుడై ఉన్న శ్రీ సాయిప్రభు ఎదుట దీనిని గానము చేస్తూ సాయికి అంకితము ఇచ్చారు . శ్రీ సాయి ప్రభు తన్మయత్వంతో, చిరునవ్వుతో దీనిని ఆలకించి ఆశీర్వదించారు. ఈ స్తోత్రమును శిర్దిలో నిత్యము 11సార్లు ,7రోజులు పారాయణ చేసినచో శ్రీ సాయి సందర్శన భాగ్యము నిస్సందేహముగా లభించును .
Wednesday, February 17, 2016
బాబా మాటలు
జై సాయి రామ్, నేను ఒక రూపాయి దక్షణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకొనినచో దానికి పది రెట్లు ఇవ్వవలెను . నేనూరక ఏమి తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరిని
అడగును . ఫకీరెవరిని చూపునొ వారివద్దనే నేను తీసుకొనేదను. ఎవరైన ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ యున్నచో,వాని వద్దనే ధనము పుచ్చుకొందును . దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుటవంటిది. అది మునుముందు గొప్ప పంట ఆనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనముపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్ధమయిపోవును.గతజన్మలో నీ విచ్చియుంటేనే గాని నీ విప్పుడు అనుభవించలేవు.
కనుక ధనమును పొంద వలెనన్నచొ, దానిని ప్రస్తుత మితురుల కిచ్చుటే సరియైన మార్గము, దక్షిణ యిచ్చు చున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన వైరాగ్యము పెరుగును . దానివలన భక్తి జ్ఞానములు కలుగును. శ్రీ షిర్డీ సాయి బాబా ,షిర్డీ .
Sunday, February 14, 2016
బాబా మాటలు
ఓం సాయిరామ్ ,కబీరుదాసు తాను వ్రాసిన దోహలో ఇలా అంటారు . నేడు చెడ్డ వాడెవడో చూద్దామని ప్రపంచం అంత గాలించాను . కానీ ఒక్కడు కూడా దుర్మార్గుడు కనిపించలేదు. ప్రతి వాని లో నాకు ఏదో ఒక మంచితనమే గోచరించింది . విసుకుచెంది నా మనస్సులోకి తొంగి చూస్తే అన్ని దుర్గుణాలు నా లోనె ఉన్నట్లు,నన్ను మించిన దుష్టుడెవరు లేనట్లు అనిపించింది .
Friday, February 12, 2016
బాబా మాటలు
జై సాయి రామ్ ,ఆద్యాత్మిక పరంపరలో మహాత్ములు ప్రకటం కావటం,నిష్ష్క్రమించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం . అన్ని కాలాలలోనూ మహాత్ములు,సిద్ద పురుషులు ఉంటూనే ఉంటారు . వారు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులు నెరవేరుస్తారు . వారు అనేకచోట్ల పనిచేసినా అందరు భగవంతుని ఆజ్ఞనుసారంగా నడుచుకుంటారు .
శ్రీ గజాననమహారాజ్ 1910 వినాయకచతుర్ది రోజున మహసమాధి చెందారు. వీరు సమాధి చెందినా ఏడున్నర సంవతసరాలకు 1918అక్టోబర్15న శ్రీ షిర్డిసాయి బాబా మహసమాధి చెందారు . శ్రీ షిర్డిసాయి బాబా మహసమాధి చెందిన ఏడున్నర సంవతసరాలకు శ్రీ తాజుద్దీన్ బాబా 1925 ఆగష్టు 18న మహసమాధి చెందారు. విచిత్రమేమిటంటే ఈ ముగ్గురు మహాత్ములు సమాధి చెందేనాటికి ఒక్కక్కరికి మధ్యకాలం షుమారుగా ఏడున్నరసంవతసరాలు. తరువాత
ఏడున్నర సంవతసరాల నాటికి శ్రీ గులాబ్ బాబా జూలై 1వ తారీకు 1932సంవతసరం లో జనించారు . శ్రీ గజాననమహారాజ్,శ్రీ షిర్డిసాయి బాబా,శ్రీ తాజుద్దీన్ బాబా,,నిష్ష్క్రమణ అనంతరం వారి ఆద్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ శ్రీ గులాబ్ బాబా రూపంలో జరుగుతున్నదని ఉత్తర భారతీయుల ప్రగాడ నమ్మకం . ఇది దత్త సంప్రదాయమని చప్పవచ్చు

Subscribe to:
Posts (Atom)