Sunday, June 24, 2012

బాబా మాటలు

నేను ఒక రూపాయి దక్షణ ఎవరి వద్ద నుండి గాని తీసికోనినచో 
దానికి నేను పది రెట్లు  ఇవ్వవలెను.నేనూరక ఏమి తీసికొనను.
యుక్తాయుక్తములు తెలియకుండ నేనెవరిని అడగను.ఎవరైన 
ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ యున్నచో వానివద్దనే నేను 
ధనము పుచ్చుకొందును.దానము చేయువాడిచ్చునది
ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది.  అది మునుముందు 
గొప్ప పంట  అనుభవించుట కొరకే .  ధర్మము చేయుటకు 
ధనముప యోగించవలెను.దక్షిణ  ఇచ్చుచున్నచో
వైరాగ్యము  పెరుగును.దానివలన  భక్తి జ్ఞానములు  కలుగును.   

  

Sunday, June 17, 2012

బాబా మాటలు

నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించితిని.  నేను వారిని చూచునపుడు వారు 
 గొప్ప  ధ్యానములో వుండునట్లు కనిపించిరి.మేమిద్దరమూఆనందములో మునేగేడివారము.
  రాత్రింబవళ్ళు నిద్రాహారములు  లేక నేను వారి వేపు  దృష్టి నిగిడ్చితిని.    వారినిచూడనిచో 
 నాకు శాంతి లేకుండెను. వారే  నాఆశ్రయము.  నా మనస్సు  ఎల్లప్పుడు  వారి యందే 
నాటుకొని  యుండెడిది .ఇదియే ఒక పైస  దక్షణ .    సాబురి  అనునది రెండవ పైస.
  రాత్రింబవళ్ళు  నిద్రాహరములు  మరచి గురువు వైపు దృష్టిని స్థిరము చేయవలెను. 
మనస్సు ఎల్లప్పుడు వారి యందేవుండవలెను . వారి  ద్యానము , వారి సేవ అనగా 
 వారు చెప్పిన మాటలు ఆచరించుటయే  వారి  సేవ . గురువు చెప్పినట్లు జీవితమందు
 నడుచుకోనవలెను.  అదియే  గురుసేవ.గురువు చెప్పిన  మాటను ఆచరించుటయే  గురుదక్షణ .
 దానినే  నిస్ట్ట  అనెదరు ,  

Friday, June 15, 2012

బాబా మాటలు

నా కొక గురువుండెను.  వారు  మిక్కిలి  దయాద్ర హృదయులు .వారికి చాలా కాలము 
 శుశ్రూష చేసితిని , కానీ  నా చెవిలో  వారు ఎ  మంత్రము వూదలెదు. వారిని విడచు 
 తలంపే  లేకుండెను.వారితోనే  వుండుటకు , వారి సేవ చేయుటకు , వారి వద్ద  కొన్ని 
ఉపదేశములు  గ్రహించుటకు నిశ్చయింఛితిని. కానీ  వారి మార్గము  వారిది .
 వారు నా తల గొరిగించిరి  రెండు  పైసలు దక్షిణ  అడిగిరి .  వెంటనే  ఇచ్చితిని.
 వారు కోరిన  రెండుకాసులలో  ఒకటి  నిస్ట్ట   రెండవది  సంతోష  స్తైర్యములతో 
గూడిన  ఓరిమి .  నేను రెంటీనీ  వారి  కర్పించితిని. వారు ప్రాసన్నులైరి.     

Sunday, June 10, 2012

బాబా మాటలు


ఉపాసినీ బాబాను  ఖండోబా ఆలయం లో నాలుగేళ్ళు  గడపమని 
బాబా ఆజ్ఞాపించారు.వారు అట్లా ఉండలేక పోయారు. అందుకనే
 ఆయన బాబాకు చేప్పకుండా మూడేళ్ళ కే, ఆయన ఆశ్రమానికి
 తిరిగి వెళ్ళిపోయారు..ఉపాసనిబాబా  ఆఉన్న ముడేళ్ళలో ప్రసాదాన్ని
బాబా కు అర్పించేవారు. ఒక  రోజున  బాబా కు ప్రసాదం  తీసుకు వస్తుంటె ఆకలిగా యున్న కుక్కకు  పెట్టకుండా వస్తాడు. .నీవు నాకు ఆ  ప్రసాదంతెచ్చి పెట్టటం  ఎందుకు ?  ఆ కుక్క  నేను ఒకటె.అని చెప్పాడు .బాబా సర్వ జీవులలోను నేనే ఉన్నానని , పిపిలికాదిబ్రహ్మ పర్యంతం అందరిని, అన్నిటిని  చూస్తున్నాఅన్ని నేనేనని  తెలిపాడు .