Friday, April 27, 2012

బాబా మాటలు

                    ఆత్మజ్ఞాన  సాధనకు  శ్రద్ధ  సబూరి  [ విశ్వాసం, సహనఎంతో అవసరము                          
                   గురు దృష్టి  తాబేలు దృష్టి వంటిది.  తాబేలు కేవలం తన  దృష్టి తోనే    
                 తన పిల్లలను పెంచి పెద్ద చేస్తున్నది. పిల్ల తాబేలు ఒక ఒడ్డున ఉంటె - తల్లి  తాబేలు 
                  రెండవ ఒడ్డున ఉండి దృష్టిని  ప్రసాదించి  పెంచి పెద్ద చేస్తున్నది. అలాగే   గురువు
                   కూడ  తన  తమ దృష్టి  నిల్పి ప్రేమతో కాపాడుతారు........సాయి బాబా .  

Wednesday, April 25, 2012

బాబా మాటలు

మనస్సును, ఇంద్రియములు స్వదీనము లో ఉంచుకొనవలెను.
శేరీరము - రధము;   ఆత్మ దాని యజమాని ;  బుద్ది -రధము
నడుపు సారధి; మనస్సు - కళ్ళెము;  ఇంద్రియ  విషయములు -
వాణి మార్గము .  ఎవరి మనస్సు  చంచలమై నదో, ఎవరి ఇంద్రియములు
అస్వాదీనములో ఉండునో  వాడు గమ్యస్తానము చేరలేడు. అట్టివాడు
చావు పుటుకల  చక్రంలో పడిపోవును.  ఎవరికి  గ్రహించు శక్తీ  కలదో,
ఎవరి మనస్సు స్వాదీన మందున్నధో , ఎవరి ఇంద్రియములు  
 స్వాదీనముండునో, ఎవడు తన బుద్దిని  మార్గదర్శిగా  గ్రహించి  తన 
మనస్సును పగ్గము తో లాగి  పట్టుకోనగలడో వాడు తన గమ్య స్తానము 
చేరుకో గలడు, 

Sunday, April 22, 2012

బాబా మాటలు

                          భక్తి విశ్వాసములు అనెడి హృదయ దీపమును సరిచేసుకోనవలెను
                          ప్రీమ యను వత్తిని వెలిగించవలెను. అట్లు  చేసిన యడల  జ్ఞానమనే 
                             జ్యోతి  [ ఆత్మ సాక్షాత్కారము ] వెలిగి  ఎక్కువ తేజస్సు  ప్రకాశించను
                             ప్రీమ లేని  జ్ఞానము ఉత్తది.  అట్టి జ్ఞానము ఎవ్వరికి అక్కరలేదు .
                             ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్చిన్న మైన 
                            అపరిమితమైన ప్రేమ ఉండవలెను.యదార్ధ మైన  కాంక్ష ,ఉత్తమమైన 
                            భావము  ఉన్నచోటనే భగవంతుడు తానై సాక్షాత్కారిం చును.అదియే
                            ప్రేమ. అదియే  మోక్ష మునకు మార్గము.