Saturday, February 25, 2012

baba maatalu

        ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారి కోరికలు  తీర్చెదను .వారిని నలుదిశల కాపాడెదను
        నా లీలలు గానము చేయువారికంతులేని  యానందము  శాస్వతమైన  తృప్తిని  ఇచ్చెదనని
        నమ్ముము. ఎవరైతే నన్నుపూజించెదరో ,స్మరించెదరో, నా రూపమును తమ  మనస్సున
        నిలుపుకొనేదరో వారిని దుఃఖబంధనములనుండి ప్రాపంచిక విషయములననింటిని  మరచి
          నా నామమే జపించుచు , నా పూజనే సలుపుచు, నా లీలలను, చరిత్రను మననము
          చేయుచు ఎల్లప్పుడు  నన్నే జ్ఞప్తి యందు౦చుకొనువారిని సకలరోగములు నుండి కాపాడెదను ,

Tuesday, February 21, 2012

baba maatalu

ఎవరు సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య  శరణాగతి పొందేదురో వారు
దేవునితో ఐక్యముచెందేదురు. వారికి  దేనితో  సంబంధముగాని, బేధభావము గాని
ఉండదు . వారికీ జాతి మతములతో గాని నెట్టి సంబంధము వుండదు ...........సాయిబాబా

Saturday, February 18, 2012

బాబా మాటలు

నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుదూ బాధపదనవసరములేదు .నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్దలతో మానఃపూర్వకంగా  నన్నే ఆరాధించువారి  యోగ సమాచారములు  నేను చూచెదను .ఎల్లప్పుడు
నన్నే గుర్తు  ఉంచుకోనుము.మనసును ధనసంపార్జనము, దేహ పోషణ గృహ సంరక్షణ పట్ల సంచరించాగుండా
ఉండాలి .





Sunday, February 12, 2012

baba maatalu

మీరెక్కడ  ఉన్న  ఏమి  చేయుచున్న నాకు  అన్ని తెలుయును. నేను అందరిహృదయములు                      పాలించువాడను.అందరి హృదయాలలో నివసించువాడను.నేను ప్రపంచమందుగల  చరాచరకోటి 
నావరించివునాను.  ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే .సృష్టి  సితి లయకారకుడను
నేనే.ఎవరతే  తమ దృష్టిని నావైపు  త్రిప్పెదరో  వారి కేహాని గాని భాధగాని  కలుగదు. నన్ను మరచిన
వారిని మాయ బాదపెట్టును ..................................షిర్డీ సాయి బాబా
     

Friday, February 10, 2012

బాబా మాటలు


భయపడకు తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము .అనగా  జ్ఞానమును విడువకుము.మనస్సును కేంద్రీకరించుము. దూరముగా  పోనీయకు
అంతరాత్మను  చూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము నీవు
తప్పక  రక్షింప బడెదవు    
              
తిరుగలి క్రింది రాయీ    :  కర్మ
మీద రాయీ                 : భక్తి
తిరుగలి మీద పిడి        :  జ్ఞానమ

Tuesday, February 7, 2012

బాబా మాటలు

నా బక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడు లోటుండదు నా యందే మనస్సు నిలిపి భక్తి శ్రద్దలతో మనః పూర్వకంగా నన్నే యారాధించు వారి యోగ సమాచారాలు నేనే చూస్తాను