Friday, November 23, 2012

బాబా మాటలు

ఊరకనే  చదువు వలన ప్రయోజనము లేదు . నీవు చదివినదంతయు 
నాలోచింఛి ఆచరణలో పెట్టవలెను . గురువు యొక్క ఆశ్వీర్వాదము 
లేనిదే కేవలము పుస్తక జ్ఞానము వలన ఫలితముండదు .  ఆత్మ 
సాక్షాత్కారము లేనిదే  పుస్తక జ్ఞానము వలన ప్రయోజననము  లేదు .
ఎవరు అహంకారపూరితులో  ఎవరు ఇంద్రియ విషయముల  గూర్చి 
ఎల్లప్పుడుచింతిం చేదరో  వారికి గురు భోదనలు వ్యర్ధములు .                                                 

నీవు దాహము గల వారికి నీరిచ్చినచో ,  ఆకలి గొన్నవారికి 
అన్నము పెట్టినచో . దిగంబరులకు వస్త్రమిచ్చినచో  భగవంతుడు 
మిక్కిలి ప్రీతి చెందును . దానము చేయువాడు  ఇచ్చునది 
ప్రస్తుతము  విత్తనము నాటుట  వంటిది . అది ముందు ముందు 
గొప్ప పంట అనుభవించుట  కొరకే .  నీవు గురువు  నందు 
నమ్మకము విశ్వాసము ఉంచుము ........ 

Saturday, November 17, 2012

బాబా మాటలు

మన హృదయము స్వచ్ఛముగా వున్నంత  వరుకు ఏమియు 
దోషము  లేదు  అని సాయి నానా సాహెబ్   చందోర్కర్  తో 
అన్నారు .ద్వారకామాయి వద్ద గల తాబేలు  బొమ్మ
 ద్వారకామాయిలోనికి  భక్తుడు ఎలా వేళ్ళలో తెలిపీ  ప్రతీకగా 
భావించవచ్చు .  భక్తుడు  తనలో బహిర్గతములవుతున్న 
ఇంద్రియములను  తాబేలు వలే  లోనికి ఉపసంహరించుకోవాలి ,
అప్పుడే  ద్వారకామాయి  లోని బాబాను దర్శించ గలము ........,