నీ దగ్గరకు ఎ ప్రాణి వచ్చినా తోలేయ్యవద్దు , ఆదరించు , ఋణానుభంధంపై
.నమ్మకముంచి గుర్తుంచుకో , ఆకలిగొన్న వారికి అన్నం , గుడ్డలు లేనివారికి
యివ్వు .. భగవంతుడు సంతోషిస్తాడు . నిన్ను ఎవరైనా సరే ఏమైనా అడిగితే
సాధ్యమైనంతవరకు యివ్వు , లేక యిప్పించు. " లేదు " అనవద్దు .ఇచ్చేందుకు
ఏమిలేకపోతే మర్యాదగా చెప్పు . చులకనచేయడం, కోపగించుకోవటం తగదు .
నీ దగ్గరున్నా ఇవ్వాలనిపించక పోతే లేదని అబద్దం చెప్పవద్దు . ఇవ్వలేనని
మర్యాదగా చెప్పు .